నూతన వధూవరులతో వెంకటేష్ దంపతులు

దగ్గుబాటి వెంకటేష్ -నీరజల రెండో కూతురు హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిషాంత్ తో జరిగింది. ఈ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

హవ్యవాహిని-నిషాంత్ నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ 25న జరిగింది. నిశ్చితార్థ వేడుకలో చిరంజీవి, మ‌హేష్ కూడా సందడి చేశారు. ఇటీవల జరిగిన వీరి మెహందీ వేడుకలో నమ్రత కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది నమ్రత శిరోద్కర్.

Related Posts