ది 100 చిత్రానికి వెంకయ్య నాయుడు ప్రశంసలు

మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ‘ది 100’ అనే కొత్త చిత్రంతో రాబోతున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది 100. ఆర్కే సాగర్‌ని విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం చేస్తూ ‘ది 100’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు.


. సినిమా చూసిన తర్వాత పోలీస్ అధికారి అంటే సాగర్ లా ఫిట్ గా హుందాగా వుండాలనిపించింది అన్నారు శ్రీ వెంకయ్యనాయుడు. ‘ది 100’ చిత్రం మంచి సందేశంతో చాలా అద్భుతంగా వుందంటూ మెచ్చుకున్నారు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా అనేది శక్తివంతమైన ఆయుధం. సినిమా ప్రభావం సమాజంపై వుంటుంది. ‘ది 100’ చిత్ర ఇతివృత్తం చాలా బావుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బావుంది. సినిమాలో చాలా మంచి సందేశం వుంది. ఇంత చక్కటి సినిమాని రూపొందించిన నిర్మాతలకు, దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ కు, కథానాయకుడు సాగర్ కు అభినందనలు. ఈ సినిమా విజయవంతగా నడుస్తుంది. ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారనే విశ్వాసం వుందన్నారాయన.


నటీనటులు, టెక్నిషియన్స్‌ తమ అనుభవాలను పంచుకున్నారు. చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

Related Posts