‘యమధీర’ టీజర్‌ లాంచ్‌

ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ చేస్తూ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన చిత్రం ‘యమధీర’. ఈ చిత్రంలో కన్నడ హీరో కోమల్‌ కుమార్‌ హీరో. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర.శంకర్ ఆర్ డైరెక్షన్‌ చేసారు. ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది.


ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు నిర్మాత వేదాల శ్రీనివాస్.
తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు నటులు నిర్మాత అశోక్‌కుమార్.ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు

Related Posts