తెలుగు నటుడు నవీన్ చంద్ర మిగతా భాషల్లోనూ బిజీ అవుతున్నాడు. అందాల రాక్షసితో రగ్‌డ్ లుక్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుని కొన్ని సినిమాలు హీరోగా చేసి అటునుంచి విలనిజం కూడా పండించిన యాక్టర్ నవీన్ చంద్ర. క్యారెక్టర్ ఎలాంటిదైనా న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్.
తెలుగులో వెబ్‌సిరీస్‌లతోనూ సత్తా చాటాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో కీలక పాత్ర పోషించడంతో.. తమిళనాట కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంంతో నవీన్ చంద్ర మెయిన్ లీడ్ గా తమిళ వెబ్‌సిరీస్‌లు నిర్మించారు. అందులో తమిళ భాషలో నవీన్ చంద్ర చేసిన వెబ్‌సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఈ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.