వళరి ట్రైలర్ గ్రాండ్ లాంచ్‌

దెయ్యాలు, ఆత్మలు, దేవుళ్ల ఉనికి కథాంశంగా ఇప్పుడు సినిమాలొస్తున్నాయి. అలాంటి కోవలోనే రాబోతున్న మూవీ ‘వళరి’ ఈ సినిమాల శ్రీరామ్‌, రితికా సింగ్ జంటగా నటించారు. ఈ సినిమాకి లేడీ డైరెక్టర్‌ ఎం మృతిక సంతోషిణి డైరెక్ట్‌ చేసారు. మార్చి 6 నుంచి ఈటివి విన్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ లాంచ్‌ చేసారు.ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో కట్స్ చాలా బావున్నాయి. చాలా క్రియేటివ్ గా వుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకురాలు సంతోషిణి కి అభినందనలు. ‘వ‌ళ‌రి’ టైటిల్ ఆకట్టుకునేలా వుందన్నారు హరీష్‌ శంకర్‌.

సంతోషిణి చాలా క్లారిటీ ఈ సినిమా తీశారు. ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. రితికా సింగ్ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కోసం తను ఫైట్స్ ని చాలా సహజసిద్ధంగా చేశారు. చాలా అంకిత భావంతో పని చేశారు. ‘వ‌ళ‌రి’లో చాలా పాత ఆయుధాలని వాడటం జరిగిందన్నారు హీరో శ్రీరామ్‌.
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వండర్ ఫుల్ జర్నీ. ఇది నా ఫేవరేట్ కథ. దర్శకురాలు సంతోషిణి చాలా అద్భుతంగా చిత్రీకరించారన్నారు హీరోయిన్ రితికాసింగ్.
రితికా సింగ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి బలం తీసుకొచ్చారు. శ్రీరామ్ గారితో పని చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఉత్తేజ్ గారు, సుబ్బరాజు ఇలా అందరితో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు డైరెక్టర్‌ మృతిక సంతోషిణి.

Related Posts