సెకండ్ సాంగ్‌తో ‘రికార్డ్‌ బ్రేక్’

దేశభక్తి కథాంశంతో వస్తున్న మూవీ ‘రికార్డ్ బ్రేక్’ . ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఘనంగా విడుదల చేయగా. ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ‘మళ్ళీ పుట్టి ‘ అనే లిరికల్ సాంగ్ రిలీజ్‌ చేసారు. చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మా సినిమా రికార్డ్ బ్రేక్ నుంచి సెకండ్ సాంగ్ గా మళ్లీ పుట్టి వచ్చినవా సాంగ్ విడుదల చేసాము. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగిందన్నారు చదలవాడ శ్రీనివాసరావు.
అతి త్వరలో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాము. ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు చదలవాడ శ్రీనివాసరావు.

Related Posts