తమిళంలో బిజీ అవుతోన్న శివానీ రాజశేఖర్

రాజశేఖర్-జీవిత కూతురు శివానీ రాజశేఖర్ తెలుగుతో పాటు తమిళంలోనూ బిజీగా సాగుతోంది. గత ఏడాది ‘కోట బొమ్మాళి పి.ఎస్‘తో మంచి హిట్ అందుకున్న శివానీ.. తమిళంలో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీ.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. జి.వి.కి జోడీగా శివానీ కనిపించబోతుంది.

తెలుగులో తన శిష్యులకు అవకాశాలు ఇవ్వడంలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముందుంటాడు. ఈకోవలోనే తమిళంలో వరుసగా తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు డైరెక్టర్ పా.రంజిత్. తన శిష్యుడు అకిరన్ మోసెస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పా.రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా.. ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుంది.

Related Posts