‘భగవంత్ కేసరి‘ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల‘

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మంచి సక్సెస్ జోరులో దూసుకెళ్తున్నాడు నటసింహం బాలకృష్ణ. ‘అఖండ, వీరసింహారెడ్డి‘తో భారీ విజయాలందుకున్న బాలయ్య ఇప్పుడు ‘భగవంత్ కేసరి‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన ‘భగవంత్ కేసరి‘ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకు ముస్తాబైంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారంలో జోరు పెంచారు మేకర్స్. ‘భగవంత్ కేసరి‘ నుంచి ఒక్కొక్కటిగా పాటలను విడుదల చేస్తున్నారు. బాలయ్య ‘అఖండ, వీరసింహారెడ్డి‘ చిత్రాలకు అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతాన్నందించిన తమన్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్నందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ‘గణేష్ ఏంథెమ్‘ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల‘ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించినట్టు విజువల్స్ ను చూస్తే అర్థమవుతోంది. ‘ఉయ్యాలో ఉయ్యాల.. నా ఊపిరే నీకు ఉయ్యాల‘ అంటూ సాగే ఈ పాటలో ఓ బాధ్యతగల తండ్రిగా బాలకృష్ణ ఎమోషన్స్ పీక్స్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. మొదట చిన్న పాప.. ఆ తర్వాత శ్రీలీల గా మారిన తీరును ఈ పాటలో చూపించారు. ఈ పాటకు భాను కొరియోగ్రఫీ బాగుంది.

Related Posts