పూజా కార్యక్రమాలతో మొదలైన ‘తలైవర్ 170‘

గత రెండు రోజులుగా ‘తలైవర్ 170‘ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి ‘జైభీమ్‘ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ముహూర్తాన్ని పూర్తిచేసుకుంది. కేరళలోని త్రివేండ్రంలో ‘తలైవర్ 170‘ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా సెరమనీలో రజనీకాంత్ తో పాటు మంజు వారియర్ కూడా పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్రబృందం.

రజనీకాంత్ తో వరుస సినిమాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ‘తలైవర్ 170‘ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తోంది. ‘జై భీమ్‘ తరహాలోనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ జ్ఞానవేల్.

Related Posts