‘అన్ స్టాపబుల్‘ ప్రోమో అదరహో..

బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. అన్ స్టాపబుల్ మళ్లీ రెడీ అయ్యింది. నటసింహం నెవర్ బిఫోర్ హోస్టింగ్ తో ‘అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‘ సిద్ధమవుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోతున్న ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజయ్యింది. ఈ ఎపిసోడ్ లో ‘భగవంత్ కేసరి‘ హీరోయిన్స్ కాజల్, శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలన్ అర్జున్ రాంపాల్ సందడి చేశారు.

‘మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. మేము తలవంచమని మీకు తెలుసు.. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు.. అనిపించినవి అన్నీ అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవ్వడు ఆపుతాడో చూద్దాం..‘ అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రోమో స్టార్ట్ అయ్యింది. ఇక.. యధావిధిగా ‘చక్కలిగింతలు పెట్టే చక్కని చిక్కని చిన్ని లిమిటెడ్ ఎడిషన్ తో అన్ స్టాపబుల్ ఉంటుంది.. కానీ.. అదే అల్లరి.. అదే సందడి..‘ అంటూ ఈ లిమిటెడ్ ఎడిషన్ గురించి చిన్న ఇంట్రో ఇచ్చాడు బాలయ్య.

కట్ చేస్తే.. అనిల్ రావిపూడి ఎంట్రీ. కళ్ల జోడు పెట్టుకుని ఎంటరైన అనిల్ రావిపూడి పై.. ‘నేను కూల్ లుక్.. నువ్వేమో ఇంటిలిజెంట్ లుక్కా..‘ అంటూ అతని కళ్లజోడు పై సెటైర్ వేశాడు బాలయ్య. తనదైన హ్యూమర్.. అల్లరితో అతిథులతో ఆటాడుకునే నటసింహం.. అనిల్ నీకు తమన్నా తో ఎందుకు గొడవయ్యింది? అంటూ ఓ ప్రశ్నను సంధించాడు. దానికి.. ‘మీరు బాలకృష్ణుడు కంటే బాబు.. ఫిట్టింగ్ కృష్ణుడు బాబు..‘ అంటూ అనిల్ సరదాగా రిప్లై ఇచ్చాడు. ఇంకా.. ‘ఆఫ్ స్క్రీన్ లో మీ ఫన్ టైమింగ్ చూశాక.. మీతో ఫుల్ టైమ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా అయితే చేయాలి..‘ అని అనిల్ రావిపూడి అంటే.. ‘నా సెటైర్స్ తో నిన్ను రిటైర్ చేస్తా?‘ అంటూ బాలయ్య సెటైరికల్ రిప్లై ఇచ్చాడు.

ఇక.. ‘భగవంత్ కేసరి లో మెచ్యూర్డ్ పాత్రతో సినిమాకి న్యాయం చేసిన నా చందమామ.. అందాల ఆడబొమ్మ కాజల్‘.. అంటూ కాజల్ ను ఆకాశానికెత్తేశాడు నటసింహం. ‘నాతో చేయడంతో ఫుల్ సర్కిల్ ఫినిష్ చేశావు.. నందమూరి హీరోలతో చేశావు.. కొణిదెల హీరోలతో చేశావు.. మరి.. మోక్షుతో చేస్తావా?‘ అంటే హండ్రెడ్ పర్సెంట్.. అంటూ సమాధానమిచ్చింది కాజల్.

శ్రీలీల తో సంభాషిస్తూ.. ‘డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు.. ఏమన్నారో తెలుసా? అయితే బాలకృష్ణ సినిమా చేయాలి.. లేదా శ్రీలీల తో సినిమా చేయాలి?‘ అంటూ ఆమె సినిమాల జోరును ఒక్క మాటలో చెప్పాడు బాలయ్య. ఇక.. అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇవ్వగానే.. ‘అరెయ్.. బొంబాయ్ సే ఆయా మేరీ దోస్త్‘ అంటూ స్టెప్పులతో అతనికి స్వాగతం పలికిన తీరు ప్రోమోలో ఆకట్టుకుంటుంది. మొత్తంమీద.. అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ‘అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‘ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో అయితే అదిరింది.

Related Posts