ముంబైలో ‘వృషభ‘ సెకండ్ షెడ్యూల్

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోలుగా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ‘. ‘ది వారియర్ అరైజ్‘ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా శనయ కపూర్, జహ్రా ఖాన్, రాగిణి ద్వివేది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బాలాజీ టెలీఫిల్మ్స్, కనెక్ట్ మీడియా, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనువాద రూపంలో హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.

నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ‘వృషభ‘ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఈ అక్టోబర్ తో పాటు.. నవంబర్ చివరి వరకూ ముంబైలో షూటింగ్ జరగనుందట. ఇక.. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ను దసరా సందర్భంగా ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

Related Posts