అల్టిమేట్ స్టార్ అజిత్ తో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు పాతికేళ్లపాటు స్టెడీ ఆఫర్స్ తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. కెరీర్ మొదలుపెట్టిన 1999 నుంచి ఇప్పటివరకూ ప్రతీ సంవత్సరం మెమరబుల్ మ్యూజికల్ హిట్స్ అందిస్తూనే ఉన్నాడు దేవిశ్రీ. ప్రస్తుతం ఆఫర్ల విషయంలో కాస్త వెనుకబడ్డాడనే ప్రచారం ఉన్నా.. అతను చేస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే అది ఎంత మాత్రం నిజం కాదు అనిపిస్తుంది.

తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీయెస్ట్ మూవీ ‘పుష్ప 2’తో పాటు.. నాగచైతన్య ‘తండేల్’, శేఖర్ కమ్ముల మల్టీస్టారర్ ‘కుబేర’ చిత్రాలకు దేవిశ్రీయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి కూడా దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడు. తెలుగు అవకాశాలను పక్కనపెడితే తమిళంలోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు డి.ఎస్.పి.

ఇప్పటికే తమిళంలో సూర్య పాన్ ఇండియా మూవీ ‘కంగువ’, విశాల్ ‘రత్నం’ చిత్రాలకు సంగీతాన్నందిస్తున్నాడు దేవిశ్రీ. లేటెస్ట్ గా తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్ కొత్త సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న 63వ సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ మూవీని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఫిక్స్ అయ్యాడు. గతంలో అజిత్ తో ‘వీరం’ వంటి హిట్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు దేవిశ్రీప్రసాద్. ఈ జూన్ లో చిత్రీకరణ మొదలుపెట్టుకోనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ వచ్చే పొంగల్ కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts