వెయ్‌ దరువెయ్‌ .. 80 శాతం కామెడీనే

పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా, యషా శివకుమార్, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ చేసిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ఇది. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు..

కార్తీక్‌ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శక నిర్మాతలు కలవడంతో ఈ సినిమా కథ వచ్చింది. వెయ్ దరువెయ్’ అనేది కమర్షియల్ టైటిల్ అయినప్పటికీ దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుందన్నారు. ‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం ఇదన్నారు. ఇందులో 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది. *నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం, మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుందన్నారు. వెయ్ దరువెయ్’ మూవీని 35 రోజుల్లో పూర్తి చేశాం. అందుకు కారణం దర్శకుడు నవీన్ రెడ్డి, నిర్మాత దేవరాజ్ పోతూరుగారి ప్లానింగ్ అదన్నారు. నాతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు. సత్యం రాజేష్, సునీల్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారన్నారు. * అన్నయ్యను నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టను. వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే అన్నారు

Related Posts