అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడోసారి పూజా హెగ్డే

టాలీవుడ్ లో ఎంత త్వరగా అగ్రపథానికి దూసుకెళ్లిందో.. అంతే త్వరగా అవకాశాలు కోల్పోయింది కన్నడ కస్తూరి పూజా హెగ్డే. ఆశ్చర్యకరంగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల నుంచి నిష్క్రమించింది. అప్పట్లో ఈ సినిమాల నుంచి తప్పుకోవడానికి వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమే కారణమని పూజా ఇచ్చిన వివరణ. తీరా చూస్తే పూజా కిట్టీలో అస్సలు సినిమాలే లేవు.

ఒకవిధంగా ‘ఆచార్య, ఎఫ్3’ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు పూజ. ఆ తర్వాత ఒకటి, రెండు హిందీ సినిమాలు చేసినా అవేమీ వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం మంచి క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ అవకాశం ఐకాన్ స్టార్ రూపంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపొందే మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం.

ఇప్పటికే బన్నీతో ‘డీజే, అల.. వైకుంఠపురములో’ వంటి హిట్ మూవీస్ లో నటించింది పూజా హెగ్డే. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, డ్యాన్సింగ్ కో ఆర్డినేషన్ కి మంచి పేరొచ్చింది. మరోవైపు పూజా హెగ్డే బాలీవుడ్ లోనూ బాగా పాపులరైన పేరు. ఈనేపథ్యంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే అల్లు అర్జున్-అట్లీ మూవీకి పూజా పేరును పరిశీలిస్తున్నారట.

Related Posts