ఈ ఫింగరింగ్ ఏంటీ బేబీ

హృదయకాలేయం, కొబ్బరిమట్ట అనే సినిమాలు డైరెక్ట్ చేసిన సాయి రాజేష్‌ గుర్తున్నాడా..? హృదయ కాలేయంతో ఇండస్ట్రీ మొత్తంపై సెటైర్ వేసిన అతను ఆశ్చర్యంగా అదే ఇండస్ట్రీ పెద్దల ఆశిస్సులు అందుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఆ మధ్య అతను నిర్మించిన కలర్ ఫోటో సినిమాకు నేషనల్‌ అవార్డ్ కూడా వచ్చింది. కొబ్బరిమట్ట ఇరిటేట్ చేసినా.. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు బేబీ అనే సినిమాతో వస్తున్నాడు సాయి రాజేష్‌. ఆనంద్ దేవరకొండ, విజార్ అశ్విన్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఎస్కేఎన్ అనే మాజీ పిఆర్వో నిర్మించిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన అప్డేట్ ఆకట్టుకుంది.

టీజర్, పాటలు అదరహో అనిపించాయి. అఫ్ కోర్స్ టీజర్ లో కలర్ ఫోటో ఛాయలు కనిపించాయని కొందరు విమర్శించారు.. అది వేరే విషయం. అయినా ఈ టీజర్ ఆకట్టుకుంది. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ మూడు పాటలు వస్తే.. అన్నీ హిట్టే. ఇక లేటెస్ట్ గా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించేందుకు ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అనౌన్స్ చేశారు. జూలై 14న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇంత వరకూ బానే ఉంది.


అయితే ఈ రిలీజ్ డేట్ ను అప్డేట్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూడగానే కొంత అసహ్యంగా ఉందనే చెప్పాలి. హీరోయిన్ డ్రెస్ లో నుంచి మిడిల్ ఫింగర్ ను చూపుతూ కనిపిస్తోంది. మామూలుగా మిడిల్ ఫింగర్ ను దేనికి ఇండికేషన్ గా వాడతారో చాలామందికి తెలుసు. అలాంటిది వీళ్లు ఆ ఫింగర్ ను ఇలా వాడటం ఇప్పటి వరకూ సినిమాపై వచ్చిన పాజిటివ్ వైబ్స్ పై దెబ్బ కొట్టేలా ఉంది.

ఇంకా చెబితే ఈ తరహా వ్యవహారాలు ఒకప్పుడు బూతు సినిమాల్లాంటివి తీసిన మారుతి అండ్ టీమ్ సినిమాలకు కనిపించేవి. ఇప్పటి వరకూ ఎంతో పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్న ఓ బేబీ నుంచి ఇలాంటి పోస్టర్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం.


అయితే ఈ పోస్టర్ ను కావాలనే విడుదల చేశారు అనేవాళ్లూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకు పాటలు బావున్నాయి, టీజర్ బావుంది అన్న టాక్ వస్తోంది కానీ.. అస్సలే మాత్రం బజ్ రావడం లేదు. మేకర్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ హైప్ రావడం లేదు. అందుకే ఇలాంటి కాంట్రవర్శీయల్ స్టిల్స్ వదిలితే ఏదో రకంగా నలుగురూ మాట్లాడుకుంటారు కదా అనేదే వారి కాన్సెప్ట్ లా కనిపిస్తోంది.

పైగా ఫ్యామిలీ అంతా కలిసి తమ్ముడి శోభనం చూస్తాం అనే కళాఖండం తీసిన గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ కదా ఇతను.. అందుకే అతన్నుంచి ఇలాంటి ఫోటో రావడం ఆశ్చర్యమేం కాదు. పైగా తమ చిత్రాన్ని పవన్ కళ్యాణ్‌ బ్రో సినిమాతో పాటుగా లేపండి అని ట్విట్టర్ లో విన్నపం కూడా చేస్తున్నాడు సదరు దర్శకుడు. మరి మిగతా హీరోల అభిమానులు అక్కర్లేదేమో. కానీ ఈ స్టిల్ మాత్రం చీప్ గా ఉందనే చెప్పాలి.

Related Posts