సత్య కామెడీ ఇంటర్య్యూ

సత్య.. కమెడియన్ గా తిరుగులేని టైమింగ్ తో ఎన్నో సినిమాల్లో నవ్వించాడు. అప్పుడప్పుడూ సునిల్ ను ఇమిటేట్ చేస్తున్నాడా అనిపించినా.. ప్రస్తుతం సునిల్ కామెడీ చేయడం లేదు కాబట్టి మనోడు పాసైపోతున్నాడు.

టైమింగ్, ఎక్స్ ప్రెషన్ లో సత్య స్పెషాలిటీ వేరే ఉంటుంది. అదే అతనికి వరుసగా ఆఫర్స్ తెస్తోంది. ఇక హీరో నాగశౌర్యతో సత్య కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ అనిపించుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ నటించిన సినిమా రంగబలి ఈ జూలై 7న విడుదల కాబోతోంది.

చాలా రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన వీళ్లు అన్ని ప్రమోషన్స్ లోనూ ఆకట్టుకుంటున్నారు. మామూలుగా ప్రమోషన్ అంటే యాంకర్ ఉంటారు. వీరు గెస్ట్ లుగా కనిపిస్తారు. బట్ ఈ సారి సత్య .. సరదాగా నాగశౌర్యను ఇంటర్వ్యూ చేశాడు.

ఇందులో వింతేముందీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతను సత్యలా ఇంటర్వ్యూ చేయలేదు. ఇంటర్వ్యూస్ చేయడంలో వెరైటీ అనిపించుకున్న కొందరు జర్నలిస్ట్ ను ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యను ప్రశ్నలు అడిగాడు. అంతే కాదు.. అలా వెరైటీ అనిపించుకున్నవారి బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ కూడా అచ్చుగుద్దినట్టు దించేశాడు. దీంతో అతను ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాడు ప్రేక్షకులకు సులువుగానే అర్థం అవుతుంది. అదే సత్య ప్రతిభ.


ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా నలుగురుని ఇమిటేట్ చేశాడు. ఇందులో స్టూడియో నుంచి బయటికి వెళ్లిపోమ్మని ఆ మధ్య ఓ హీరోను ఇన్సల్ట్ చేసిన లేడీ యాంకర్ గెటప్ కూడా వేశాడు సత్య. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. ఇక ఫుల్ ఇంటర్వ్యూ వస్తే ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తుందనిపించేలా ఉంది. ఏదేమైనా ఈ సినిమాలో సత్య కామెడీ హైలెట్ గా ఉంటుందని టాక్. ఇప్పుడు తన కామెడీ చూడ్డానికి వచ్చే ఆడియన్స్ నంబర్ ను కూడా పెంచేలా ప్రమోషన్స్ లో యాంకర్ లా ఇరగదీస్తున్నాడన్నమాట.

Related Posts