ఓటిటిలోకి బెదురులంక

ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ ఫేమ్ అయిన కార్తికేయ ఆ ఫేమ్ ను నిలబెట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఆశించిన హిట్స్ పడటం లేదు. కొంతలో కొంత బెటర్ అన్నట్టుగా తాజాగా బెదురు లంక2012 సినిమా పడింది. క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. స్లోగా స్టార్ట్ అయినా.. మెల్లగా పికప్ అయిందీ సినిమా. దీంతో పాటు విడుదలైన గాండీవధారి డిజాస్టర్ కావడం కూడా కొంత వరకూ కలిసొచ్చింది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో వెంటనే టీమ్ అంతా రంగంలోకి దిగి టూర్స్ తో ప్రమోషన్స్ పెంచారు. అవి వర్కవుట్ కావడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదు అనిపించుకుంది బెదురులంక2012.


థియేటర్స్ లో కమర్షియల్ గా సేఫ్‌ అనిపించుకున్న ఈ చిత్రం ఓటిటిలో సందడి చేస్తోంది. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోందీ సినిమా. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 2012లో యుగం అంతం అయిపోతుందనే పుకారు నేపథ్యంలో అవుట్ అండ్ అంవుట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఓటిటి ఆడియన్స్ ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉంది టీమ్. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో చూసేలా ఉంటుంది కాబట్టి.. ఓటిటిలో కూడా వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నారు.

Related Posts