ఈ గన్నులన్నీ పవన్ కళ్యాణ్ కోసమే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు గన్నులంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు. తన సినిమాల్లో కూడా వాటిని విరివిగా ఉపయోగించే సన్నివేశాలుంటే బాగా ఎంజాయ్ చేస్తాడు. అందుకే దర్శకులు ఫైట్స్ లో ఆస్కారం లేకపోతే కనీసం పాటల్లో అయినా తుపాకులు పేల్చేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఫోటోలో ఉన్న గన్నులన్నీ పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమా కోసమే. కొత్త సినిమా అనగానే గ్యాంగ్ స్టర్ గా నటిస్తోన్న ఓజి అనే అనుకుంటున్నారు కదా.. ? కానీ కాదు. ఇవన్నీ హరీష్‌ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం. ఈ సినిమా కోసం కొత్త డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్‌. ఈ నెల 27 నుంచి ఆ షెడ్యూల్ మొదలవుతుంది. అందుకే వేగంగా తన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు హరీష్‌ శంకర్. కాకపోతే ఆ టైమ్ కు పొలిటికల్ గా ఏ ఇష్యూ రాకుండా ఉండాలి. అప్పుడే ఈ షూటింగ్ మొదలవుతుందని వేరే చెప్పక్కర్లేదు.


ఇక గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్‌ కెరీర్ కే కొత్త జోష్ ఇచ్చాడు హరీష్‌ శంకర్. ఆ మూవీ రీమేక్. ఇప్పుడు చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్. ఈ సారీ పోలీస్ గానే నటిస్తున్నాడు. తెరిలో అగ్రెసివ్ నెస్ కు ఆస్కారం ఎక్కువ.అయినా ఆ సినిమాలో ఇన్ని గన్స్ వాడలేదు. బట్ ఇక్కడ దర్శకుడు, హీరో ఇద్దరూ అగ్రెసివ్ కదా.. అందుకే కథలో ఈ మేరకు చాలా మార్పులు చేసి ఉంటారని అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. అంటే ఫ్యాన్స్ మరో గబ్బర్ సింగ్ రేంజ్ ఆల్బమ్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట. హీరోయిన్లుగా శ్రీ లీల, సాక్షి వైద్య(ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు) నటిస్తున్నారు. మొత్తంగా ఈ గన్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్‌ ర్యాంపేజ్ ను ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఊహించుకుంటారేమో.

Related Posts