గేమ్ ఛేంజర కొత్త షెడ్యూల్

రామ్ చరణ్‌ – శంకర్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ ఓ అంతులేని కథలా సాగుతోంది. 2021 డిసెంబర్ లోనే ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటి వరకూ 25శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోలేదు. మధ్యలో శంకర్ కోర్ట్ లో ఓడిపోయి భారతీయుడు2ను పూర్తి చేయాల్సి రావడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన బెట్టాడు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఏం చేయలేక చేతులెత్తేశాడు. దీంతో రామ్ చరణ్‌ కు పనిలేకుండా పోయింది. కొన్నాళ్లుగా ఇదుగో అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప షూటింగ్ మాత్రం ముందుకు సాగడం లేదు. ఫైనల్ గా ఓ కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది.


గేమ్ ఛేంజర్ కోసం ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు శంకర్. ఈ నెల చివరి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై అత్యంత కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట. ఈ పార్ట్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొనబోతోంది. అయితే ఇది ఎన్ని రోజుల షెడ్యూల్ అనే క్లారిటీ లేకపోయినా భారీ షెడ్యూల్ అనే రొటీన్ డైలాగ్ మాత్రం వాడుతున్నారు. ఈ షూటింగ్ పార్ట్ కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరి ఇకనైనా కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారా లేక మళ్లీ ఎప్పట్లానే బ్రేకులు పడతాయా అనే ప్రశ్నకు కూడా ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. జస్ట్ మరో షెడ్యూల్ మొదలైందంతే.

Related Posts