‘విశ్వంభర’.. మెగాస్టార్ లుక్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘విశ్వంభర’. ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ రివీల్ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. కానీ.. ఈ మూవీలో మెగాస్టార్ లుక్ ఎలా ఉంటుంది? అనేది ఇప్పటివరకూ రివీల్ చేయలేదు.

అయితే.. చిత్రబృందం అధికారికంగా వెలువడించకపోయినా.. చిరంజీవే స్వయంగా ‘విశ్వంభర’లో తన మేకోవర్ ను బయటపెట్టాడు. జనసేన పార్టీకి తన సపోర్ట్ గా చిరంజీవి రూ.5 కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చెక్ ను తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ కి అందజేసిన సందర్భంలో ‘విశ్వంభర’లోని తన గెటప్ తోనే బయటకు వచ్చాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరు.. దొరబాబు అనే పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్న ఈ లుక్ అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Related Posts