‘దేవర’ గురించి ఎన్టీఆర్ లీక్స్!

తన మనసుకి నచ్చిన వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈకోవలోనే లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యాడు. ఈ వేడుకలో టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డను ఆకాశానికెత్తేశాడు. అతను డీజే టిల్లు పాత్రలో లీనమైన విధానానికి ఫిదా అయినట్టు తెలిపాడు. అంతేకాదు.. అతను ఆన్ స్క్రీన్ పై ఒకలా ఉంటాడని.. బయట మరోలా ఉంటాడని.. సినిమా అంటే సిద్ధుకి ప్రాణమని చెప్పాడు తారక్.

‘టిల్లు స్క్వేర్’ని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్.. పనిలో పనిగా ‘దేవర’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ఎప్పుడూ తన సినిమాకి సంబంధించిన లీకులను ఇవ్వడానికి ఇష్టపడని ఎన్టీఆర్.. ఈసారి మాత్రం ‘దేవర’ గురించి ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ అప్డేట్స్ అందించాడు. ‘కొంచెం అతిగా అనిపించినా ఫర్వాలేదు కానీ.. నమ్మకంగా చెబుతున్నా ‘దేవర’ చూశాక నా అభిమానులు అంతా కాలర్ ఎగరేయడం కన్ఫమ్ అంటూ ఆడిటోరియంని ఈలలతో హోరెత్తించాడు..’ తారక్. అలాగే.. ”దేవర’ సినిమా నేపథ్యం అంతా భయం చుట్టూ ఉంటుందని.. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పాయింట్ ని ఈ సినిమాలో చూపించబోతున్నామని’ తెలిపాడు.

Related Posts