సైలెంట్ గా వంద కోట్లు కొట్టేసిన ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్.. ఆడు జీవితం’ సినిమా మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన ప్రతీ భాషలోనూ ‘ది గోట్ లైఫ్’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. అయితే.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం వసూళ్ల విషయంలో వెనుకబడొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. కానీ.. లేటెస్ట్ గా ‘ది గోట్ లైఫ్’ కలెక్షన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.

మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజైన ‘ది గోట్ లైఫ్’ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు వసూళ్లను సాధించింది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి పాత్రలో జీవించాడు పృథ్వీరాజ్. ఈ పాత్రకోసమే ఎంతో వెయిట్ తగ్గాడు. తన మేకోవర్ మొత్తం మార్చుకున్నాడు. ఒక పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ ను నజీబ్ రోల్ లో చూపించాడు పృథ్వీరాజ్. అందుకే.. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా పృథ్వీరాజ్ పోషించిన పాత్రను ప్రశంసలతో ముంచెత్తారు. చూడాలి.. లాంగ్ రన్ లో ‘ది గోట్ లైఫ్’ ఇంకా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో

Related Posts