శ్రుతి హాసన్ చేతికి సమంత హాలీవుడ్ ప్రాజెక్ట్?

అన్ని అవార్డులలో పెద్దన్న వంటిది ఆస్కార్. అలాగే.. అన్ని వుడ్స్ లోనూ హాలీవుడ్ ను అగ్రగామిగా చూడడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే.. ఏ స్టార్ అయినా.. ఒక్క హాలీవుడ్ సినిమాలో నటిస్తే చాలనుకుంటారు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకుంటారు. అలాంటి అవకాశమే.. ఇప్పుడు శ్రుతి హాసన్ కి లభించిందట. ఆమధ్య సమంతతో హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ ప్రకటించిన హాలీవుడ్ ప్రాజెక్ట్ లో శ్రుతి హాసన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.

‘అరేంజ్మెంట్స్ అఫ్ లవ్’ నవల ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రానికి ‘చెన్నై స్టోరీ’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ మొదలుకొని మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారట. త్వరలోనే.. శ్రుతి హాలీవుడ్ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

మరోవైపు ‘సలార్’తో సెన్సేషనల్ హిట్ అందుకున్న శ్రుతి.. ‘సలార్ 2’లోనూ నటించబోతుంది. అయితే.. మొదటి భాగంలో తక్కువ నిడివికే పరిమితమైన శ్రుతి.. రెండో భాగంలో తన స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెబుతోంది.

అడవి శేష్ తో నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ కూడా శ్రుతి కిట్టీలో ఉంది

Related Posts