ప్రశాంత్ నీల్ కి టెస్టింగ్ టైమ్

హీరో డామినేటింగ్ ఇండస్ట్రీగా చెప్పుకునే సినీ ఫీల్డ్ లో కొంతమంది దర్శకులకు కూడా భారీ స్టార్ డమ్ ఉంది. వారు కోరుకున్న స్టార్ కాస్ట్ తో.. వారు నిర్దేశించిన బడ్జెట్ లో సినిమాలు చేసే అధికారం ఉంది. అలాంటి డైరెక్టర్స్ లో దర్శకధీరుడు రాజమౌళిని చెప్పొచ్చు. సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో జక్కన్న సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

ఈమధ్య కాలంలో దక్షినాది నుంచి రాజమౌళికి దీటైన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్. ‘మా నగరం’ మొదలు ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగాడు లోకేష్. ‘విక్రమ్’ విజయంతో లోకేష్ కనకరాజ్ ను రాజమౌళితో పోల్చారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘లియో’ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కావడంలో విఫలమైంది. కలెక్షన్స్ పరంగా ఓ.కె. అనిపించుకున్నా.. ఫైనల్ గా లోకేష్ కనకరాజ్ టాలెంట్ పై డౌట్స్ వెల్లిబుచ్చేలా చేసింది.

రాజమౌళికి దీటైన దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కి కూడా ఇప్పుడు పెద్ద టెస్టింగ్ టైమ్ అని చెప్పాలి. తొలి సినిమా ‘ఉగ్రమ్’తోనే డైరెక్టర్ గా తన శైలిని చూపించిన ప్రశాంత్ నీల్.. ‘కె.జి.యఫ్’ సిరీస్ తో ఎలాంటి సంచలనాలు సృష్టించాడో తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ తో ‘సలార్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

డిసెంబర్ 22న విడుదలకు ముస్తాబవుతోంది. అయితే.. సెప్టెంబర్ లోనే రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవ్వడంతోనే ‘సలార్’పై అనుమానాలు మొదలయ్యాయి. సినిమా క్వాలిటీ విషయంలో డైరెక్టర్ తర్జన భర్జనలు పడుతున్నాడనే కామెంట్స్ వినిపించాయి. మరి.. ఇవన్నీ దాటుకుని ప్రశాంత్ నీల్ ‘సలార్’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related Posts