కన్నప్ప షూటింగ్ లో గాయపడ్డ విష్ణు

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడు విష్ణు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తానే స్వయంగా నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విష్ణు గాయపడ్డాడట. ఓ డ్రోన్ షాట్ తీస్తున్నప్పుడు ఆ డ్రోన్ కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందట. విష్ణు పై డ్రోన్ పడడటంతో అతని చేతికి పలు గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడ దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించారట. విష్ణు గాయాల పరిస్థితిపై తాజా సమాచారం తెలియాల్సి ఉంది.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచయితలు రచనా సహకారం చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు.. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Related Posts