‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాని మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మించారు. నరేష్ కి జోడీగా ఫరియా నటించగా.. ఇతర కీలక పాత్రల్లో జామీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్, రితూ చౌదరి నటించారు. మే 3న విడుదలైన ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ చిత్రం రెండు రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా రూ.3.34 కోట్లు గ్రాస్ ని సాధించింది. రోజు రోజుకీ ఈ కామెడీ ఎంటర్ టైనర్ కలెక్షన్స్ బాగా పికప్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతోంది.

Related Posts