‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్‘. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల వద్ద ‘నీది నాది ఒకే క‌థ‌, విరాట‌ప‌ర్వం’ చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా ప‌నిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గెటప్ శ్రీనుకి జోడీగా అంకిత క‌ర‌త్ నటించగా.. ఆనంద్ చక్రపాణి, రూపాల‌క్ష్మి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 17న విడుదలకు ముస్తాబవుతోన్న ‘రాజు యాదవ్‘ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

క్రికెట్ ఆడుతున్నప్పుడు ముఖానికి బాల్ తగలడంతో.. రాజు యాదవ్ తన ముఖ కండరాలను కదిలించలేడు. దీంతో.. అందరికీ అతను ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉన్నట్టు కనిపిస్తుంటుంది. మరి.. ఆ నవ్వు ముఖంతో అతను ఎదుర్కొన్న అనుభవాలేంటి? తన ప్రేమ, పెళ్లి, కెరీర్ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు వంటి అంశాలతో ట్రైలర్ ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇంప్రెస్సివ్ గా ఉంది. మరి.. బుల్లితెరపై వెరైటీ గెటప్స్ తో రెచ్చిపోయే గెటప్ శ్రీను.. ‘రాజు యాదవ్‘తో ఏ రీతిన అలరిస్తాడో చూడాలి.

Related Posts