స్విట్జర్లాండ్ లో విహరిస్తున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు కుటుంబంతో సహా విహారానికి వెళుతుంటాడు. లేటెస్ట్ గా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో విహరిస్తున్నాడు మహేష్ బాబు. అక్కడ మంచు కొండల్లో కొడుకు గౌతమ్, కూతురు సితార లతో కలిసి సందడి చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే.. ఈ ఫోటోలలో తన ఫేస్ ను కవర్ చేసుకుని కనిపించాడు ప్రిన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

మరోవైపు దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమాకోసం ఫిట్ నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే జర్మనీలో ఈ అడ్వంచరస్ మూవీకి సంబంధించి రిగరస్ ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక.. స్విట్జర్లాండ్ నుంచి తిరిగి రాగానే మళ్లీ రాజమౌళి సినిమా పనుల్లో నిమగ్నమవ్వనున్నాడట మహేష్ బాబు. ఈ ఏడాది జూన్ నుంచి మహేష్ 29వ సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతుంది.

Related Posts