మే 3న విడుదలకు ముస్తాబవుతోన్న ‘జితేందర్ రెడ్డి‘

‘బాహుబలి‘ సినిమాలో సేతుపతి పాత్రలో నటించిన రాకేష్ వర్రే.. హీరోగా నటిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి‘. ఈ సినిమాకి ‘ఉయ్యాల జంపాల, మజ్ను‘ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. 1980లలో యదార్ధంగా జరిగిన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ విరించి వర్మ తెలిపాడు. ఈ మూవీలో రాకేష్ వర్రేకి జోడీగా రియా సుమన్ నటిస్తుంది. ఛత్రపతి శేఖర్ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ‘జితేందర్ రెడ్డి‘ సినిమాని మే 3న విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది చిత్రబృందం. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. వి.ఎస్. జ్ఞాన శేఖర్‌ కెమెరామెన్‌ గా వ్యవహరిస్తున్నారు.

Related Posts