సందీప్ కిషన్ కొత్త సినిమా పేరు ‘వైబ్‘

ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరు పేరు భైరవకోన‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సందీప్ కిషన్.. ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నందుకున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ కి దక్కిన హిట్ ఇది. ‘ఊరు పేరు భైరవకోన‘ తర్వాత ఇప్పుడు తాజాగా ‘వైబ్‘ పేరుతో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ‘వైబ్‘ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అలాగే.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద‘ చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ‘యుద్ధం ఎంత పెద్దది అయినా సరే చుట్టు నలుగురు స్నేహితులు తోడు ఉంటే చాలు గెలుపు నీదే మిత్రమా‘ అంటూ.. తనకు అలాంటి ఆ ఇద్దరూ స్వరూప్, రాహుల్ యాదవ్ రూపంలో దొరికారని.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘ టీమ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ‘వైబ్‘ సినిమాని అనౌన్స్ చేశాడు హీరో సందీప్ కిషన్. త్వరలో పట్టాలెక్కే ఈ చిత్రం 2025 వేసవి కానుకగా విడుదలకానుంది.

Related Posts