సూపర్ స్టార్ జైలర్ రికార్డ్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్ట్ చేసిన సినిమా జైలర్. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా, సునిల్ ఇతర పాత్రల్లో నటించారు. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ట్రైలర్ తో భారీ హైప్ వచ్చింది.

ఆ హైప్ ను నిలబెడుతూ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో పాటు వరుసగా వచ్చిన సెలవులు కూడా కలిసొచ్చాయి. కట్ చేస్తే ఇండియాతో పాటు ఓవర్శీస్ లో కూడా అదరగొట్టిందీ సినిమా. చాలా తక్కువ టైమ్ లోనే 300 – 400 కోట్ల క్లబ్ లో చేరిన జైలర్.. ఓవర్శీస్ లో ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్శీస్ లో 5మిలియన్ డాలర్స్ సాధించిన సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. యస్.. ఈ శనివారంతో జైలర్ 5 మిలియన్ క్లబ్ లో చేరింది. ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ తమిళ్ మూవీగా రికార్డ్ సాధించింది.


ఇంతకు ముందు తమిళ్ నుంచి హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా రజినీకాంత్ నటించిందే 2.0, తో పాటు పొన్నియన్ సెల్వన్ చిత్రాలు 3 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. జైలర్ వాటిని దాటి ఏకంగా 5 మిలియన్ క్లబ్ లో జాయిన్ అంది.

దీంతో పాటు ఈ మూవీ 500 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ ను జైలర్ కేవలం 9 రోజుల్లోనే సాధించడం విశేషం. ఇక ఈ వీకెండ్ కు తమిళ్ తో పాటు తెలుగులోనూ పెద్ద సినిమాలేం లేవు. ఇది కూడా ఈ మూవీకి మరో అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తంగా రజినీకాంత్ సినిమా భారీ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది.

Related Posts