రష్మిక స్థానంలో శ్రీ లీల

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ మూవీస్ లో ఆఫర్స్ కొట్టేస్తోంది. అయితే అమ్మడికి ఎందుకో బాలీవుడ్ పై కాస్త ఎక్కువ మోజు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఎక్కువగా అక్కడే ఫోకస్ చేస్తోంది.

ఈ కారణంగానే తనను తెలుగులో పరిచయం చేసిన దర్శకుడికి కూడా హ్యాండ్ ఇచ్చింది. ఛలో మూవీతో తెలుగు తెరకు ఎంటర్ అయిన రష్మిక ఆ టైమ్ నుంచి దర్శకుడు వెంకీ కుడుములతో మంచి బాండింగ్ మెయిన్టేన్ చేసింది. వెంకీ నెక్ట్స్ మూవీ భీష్మలో కూడా తనే హీరోయిన్. అప్పట్లో నితిన్ వీరిద్దరి బాండింగ్ పై వెంకీ ఏదైనా స్క్రిప్ట్ రాసుకునే ముందు మొదట రష్మిక పేరు రాసుకుటాడు అని సెటైర్ కూడా వేశాడు.

ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. దీనికి విఎన్ఆర్ అనే మూడక్షరాల వర్కింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ నుంచి సడెన్ గా తప్పుకుంది రష్మిక మందన్నా.ఈ డేట్స్ లోనే తనకు బాలీవుడ్ తో పాటు ఓ కోలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న కారణంగానే తప్పుకుందన్నారు. బట్ అసలు నిజాలేంటనేది ఎవరికీ తెలియదు.


ఇక రష్మిక స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి శ్రీ లీలను తీసుకున్నారు. ఆల్రెడీ శ్రీ లీల నితిన్ తో ‘ఎక్స్ ట్రార్డినరీ మేన్’ అనే సినిమా చేస్తోందిప్పుడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా విడుదలైన డేంజర్ పిల్లా అనే పాట కూడా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ఈ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. శ్రీ లీల చేతినిండా సినిమాలున్నా.. ఈ కథ నచ్చడం వల్ల ఓకే చెప్పిందంటున్నారు. రష్మిక నో చెప్పడం ఈ కుర్రబ్యూటీకి బలే కలిసొచ్చింది. ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ రెండో సినిమాకు వీరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందనుకోవచ్చు.

Related Posts