‘సిద్ధార్థ్ రాయ్’ ట్రైలర్.. మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతోందా?

నిన్నటి బాలనటులే.. నేటి హీరోలు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా నడుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టిన తేజ సజ్జ.. ఇప్పుడు హీరోగానూ దుమ్మురేపుతున్నాడు. ‘హనుమాన్’ మూవీతో తేజ సృష్టిస్తోన్న సంచలనం ఎలాంటిదో చూస్తూనే ఉన్నాం. ఈకోవలోనే.. మరో బాల నటుడు దీపక్ సరోజ్ హీరోగా వస్తున్నాడు. ‘ఆర్య, అతడు, పౌర్ణమి, భద్ర’ వంటి సినిమాలలో బాల నటుడిగా నటించిన దీపక్.. ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం ‘అర్జున్ రెడ్డి’ని గుర్తు తెచ్చేలా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ ను సేమ్ టు సేమ్ దింపేశారు. అదే యారగెన్స్.. అదే బోల్డ్ నెస్ ‘సిద్ధార్థ్ రాయ్’లోనూ కనిపిస్తున్నాయి. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోని హీరో అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని వి.యశస్వి తెరకెక్కించాడు. జయ అడపాక నిర్మించిన ఈ చిత్రంలో తన్వి నేగి, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్యామ్ కె.నాయుడు, ప్రవీణ్ పూడి వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts