‘పుష్ప 2‘ నుంచి శ్రీవల్లి స్పెషల్ పోస్టర్

ఎన్ని సినిమాలు చేసినా.. నటీనటులకు తమ జీవితంలో గుర్తిండిపోయే పాత్రలు కొన్నే ఉంటాయి. నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ లో అలాంటి ఒక పాత్ర శ్రీవల్లి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప ది రైజ్‘లో శ్రీవల్లిగా నటించి.. ఆ పాత్రకే వన్నె తెచ్చింది రష్మిక. అలాంటి ఐకానిక్ రోల్ లో మరోసారి మురిపించడానికి ముస్తాబవుతోంది. ‘పుష్ప‘ సెకండ్ పార్ట్ ‘ది రూల్‘లోనూ శ్రీవల్లిగా అలరించడానికి రెడీ అవుతోంది ఈ నేషనల్ క్రష్. ఈరోజు (ఏప్రిల్ 5) రష్మిక పుట్టినరోజు కానుకగా ‘పుష్ప 2‘ నుంచి స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ క్రేజీ సీక్వెల్ లో రష్మిక పాత్ర శ్రీవల్లి గెట‌ప్‌ ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే టీజర్ తో రష్మిక పోషిస్తున్న శ్రీవల్లి పాత్రపై ఇంకా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts