‘ఫ్యామిలీ స్టార్‘ రివ్యూ

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, వెన్నెల కిషోర్, జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అభిరామి, రవి ప్రకాష్, రాజా చేంబోలు తదితరులు
సినిమాటోగ్రఫి: కేయూ మోహనన్‌
సంగీతం: గోపీ సుందర్‌
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌
దర్శకత్వం: పరశురామ్‌
విడుదల తేది: ఏప్రిల్ 5, 2024

విజయ్ దేవరకొండ అంటేనే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ముఖ్యంగా.. ఇప్పటివరకూ రొమాంటిక్ రోల్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్. ఇక.. కొన్ని సినిమాలుగా తన మేకోవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న విజయ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని చేసి ప్రయత్నమే ‘ఫ్యామిలీ స్టార్‘. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ స్టార్‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? ఈ విశ్లేషణలో చూద్దాం.

కథ
కథగా చెప్పుకుంటే త‌న కుటుంబాన్ని, త‌న జీవితంలోకి వ‌చ్చిన ఓ అమ్మాయినీ ప్రాణంగా ప్రేమించిన ఓ యువ‌కుడి క‌థే ఈ చిత్రం. గోవ‌ర్థన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. ఇద్దరు అన్నయ్యలు వాళ్ల పిల్లలు.. ఆ బాధ్యత కూడా త‌నే తీసుకొంటాడు. వ‌దిన‌ల్ని గౌర‌వంగా చూసుకొంటాడు. చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న గోవర్థన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. తన కుటుంబాన్ని అర్థం చేసుకున్న ఇందుతో ప్రేమలో పడతాడు గోవర్థన్. అసలు.. ఇందు ఎందుకు గోవర్థన్ ఇంటికి వచ్చింది. ఆమె రావడం వెనుక ఉన్న మిషన్ ఏంటి? వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
కుటుంబ భారాన్నంతా మోస్తున్న ఓ చిన్న కొడుకు.. త‌న ప్రాజెక్ట్ థీసిస్ కోసం ఇంటి డ్రామాని త‌న సొంత ప్రయోజనాల కోసం వాడుకొన్న హీరోయిన్.. ఇద్దరి మధ్య ప్రేమ, గొడ‌వ‌లు, క‌లుసుకోవ‌డం – ఇదీ స్థూలంగా చెప్పుకోవాలంటే ‘ఫ్యామిలీ స్టార్‘ కథ. దర్శకుడు పరశురామ్ కథలు రొటీన్ గానే సాగినా.. కథనం ఆకట్టుకుంటుంది.
విజయ్ తోనే ‘గీత గోవిందం‘తో వంటి సింపుల్ స్టోరీతో వంద కోట్లు కొల్లగొట్టాడు. అయితే.. ‘ఫ్యామిలీ స్టార్‘ విషయంలో ఆ మ్యాజిక్ పనిచేయలేదు అని చెప్పొచ్చు. క‌థప‌రంగా చూస్తే చిన్న అంశ‌మే. ఓ బ‌ల‌మైన సినిమాకి, అంచ‌నాలున్న సినిమాకి కావాల్సిన స‌రకు, సంఘర్షణ ఇందులో క‌నిపించ‌దు.

మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసే విన్యాసాలతో క‌థ మొద‌ల‌వుతుంది. ఇంట్లోనూ, బ‌య‌ట పొదుపు కోసం క‌థానాయ‌కుడు ప‌డే పాట్లతో స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ – మృణాల్ ఠాకూర్ జోడీ మిన‌హా సినిమా పెద్దగా ప్రభావం చూపించ‌దు. భావోద్వేగాలు, హాస్యం కృత్రిమంగా అనిపిస్తాయి.

అమెరికా నేప‌థ్యంలో సాగే ద్వితీయార్ధంలోని చాలా స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇందు థీసిస్ ప్రసంగం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపించినా, ప‌తాక స‌న్నివేశాలు సాధార‌ణంగానే అనిపిస్తాయి. ‘సన్ ఆఫ్ సత్య మూర్తి, మన్మధుడు‘ సినిమా కథలకు మిడిల్ క్లాస్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు పరశరామ్. ‘గీత గోవిందం‘ లో ఉన్న పాటలు, లవ్, ఫ్యామిలీ ఎమోషన్ ఈ సినిమాలో లేవు. ఇంటర్వెల్ ముందు పది నిమిషాలు మాత్రం అదిరింది. ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని విజయ్ చేసిన ప్రయత్నం అభినందనీయం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
విజ‌య్ దేవ‌రకొండ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడైన గోవర్థన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటివరకూ ఎక్కువగా రొమాంటిక్ ఇమేజ్ కనిపించిన విజయ్.. ఈ సినిమాకోసం ఫ్యామిలీ మ్యాన్ గా మారిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందు పాత్రలో మొదటి అర్థభాగం హాస్యాన్ని పండిస్తూ.. ఎంతో అందంగా కనిపించిన మృణాల్.. ద్వితియార్థంలో ఎమోషన్స్ ను బాగా పండించింది.

రోహిణి హట్టంగడి పోషించిన బామ్మ పాత్ర, జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా గోపీ సుందర్ సంగీతం, నేపథ్య సంగీతం అంతగా ప్రభావం చూపించలేదని చెప్పొచ్చు. కేయు మోహనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.

చివరగా
విజయ్, మృణాల్ జోడీ బాగుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే.. కథ, కథనంలో కొత్తదనం కొరవడడం, కామెడీ, భావోగ్వేగాలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్‘

విజయ్, మృణాల్ జోడీ బాగుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే.. కథ, కథనంలో కొత్తదనం కొరవడడం, కామెడీ, భావోగ్వేగాలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్‘ ఓ రొటీన్ మూవీగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5 / 5

Related Posts