Tag: Anasuya Bharadwaj

‘మాయా పేటిక’ ఫస్ట్ లుక్ లాంచ్‌లో నిర్మాత శరత్

జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల…

‘మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20 న విడుదల

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్  తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్  గా తెరకెక్కుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల…

వైవిధ్యంగా “అరి” మూవీ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “అరి”. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” ప్రారంభం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ ఎక్కించిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. 350…

‘గాడ్ ఫాదర్’ టీజర్ తెలుగు, హిందీలో విడుదల

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ టీజర్ ని తెలుగు, హిందీలో విడుదల చేశారు నిర్మాతలు. టీజర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార , సత్య దేవ్‌తో సహా ఇతర ప్రముఖ పాత్రలను  పవర్ ఫుల్ గా పరిచయం చేశారు.”ఇరవై ఏళ్ళు ఎక్కడి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్ గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు”. ‘ఇక్కిడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడద” డూ యు నో హూ హి ఇస్ ? హిఈజ్ ది బాస్ అఫ్ ది బాసస్. అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్”టీజర్ బ్యాగ్రౌండ్లో వినిపించిన ఈ డైలాగ్స్ తర్వాత గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ ఎంట్రీ  ఇవ్వడం పవర్ ప్యాక్డ్ గా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది.తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కు కుడి భుజంగా భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇవ్వడం మరింత క్యురియాసిటీని పెంచేసింది.“లగ్ రహా హై బడి లంబీ ప్లానింగ్ చల్ రహీ హై. అప్నే ఇస్ ఛోటే భాయ్ కో భూల్ నానహీ.. కహే తో ఆజాతా హూ మై…” అంటూ గాడ్ ఫాదర్‌కి  మద్దతు తెలపగా..”వెయిట్ ఫర్ మై కమాండ్’ అని చెప్పడం ఇంట్రస్టింగా వుంది. టీజర్‌లోని ప్రతి సీక్వెన్స్ అద్భుతమైన ఎలివేషన్‌తో మెగా థ్రిల్ పంచాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌గా అదరగొట్టారు. మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకుంది. స్టైలిష్‌గా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ బ్లాక్‌లు బ్రిలియంట్ గా వున్నాయి.టీజర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ జీపులో కలిసి రావడం మెయిన్ హైలైట్. ముందుగా చెప్పినట్లుగా ఇది చిరంజీవి అభిమానులకు, సినీ అభిమానులకు  అడ్వాన్స్ మెగా బర్త్ డే ప్రజంటేషన్. సల్మాన్ ఖాన్  ప్రజన్స్ ఒక బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఫాక్టర్ అని చెప్పాలి.ఉన్నతమైన  నిర్మాణ విలువలు, నీరవ్ షా  అద్భుతమైన కెమెరా పనితనం, ఎస్ థమన్  బీజీఎం అవుట్ స్టాండింగ్ గా వున్నాయి.  దర్శకుడు మోహన్ రాజా అన్ని వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని టీజర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. టీజర్ సినిమాపై  భారీ అంచనాలను పెంచింది. సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు..గాడ్ ఫాదర్ 2022 దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం:- మోహన్ రాజా నిర్మాతలు:- ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సమర్పణ:- కొణిదెల సురేఖ బ్యానర్లు:- కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంగీతం:- ఎస్ ఎస్ థమన్ డీవోపీ:- నీరవ్ షా ఆర్ట్ డైరెక్టర్:- సురేష్ సెల్వరాజన్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్:- వాకాడ అప్పారావు పీఆర్వో:- వంశీ-శేఖర్

చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ ఆగస్ట్ 21న విడుద‌ల

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్‌ లుక్ తో ఆశ్చర్యపరిచారు. ఆ పాత్రను పరిచయం చేయడానికి ఉద్దేశించిన చిత్రం యొక్క గ్లింప్స్ కూడా అద్భుతమైన స్పందనను పొందింది. ఇంకా అద్భుత‌మైన అప్‌డేట్ చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 21న సినిమా టీజర్ విడుదల కానుంది.ఇక ఈరోజు విడుద‌ల‌చేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు, త‌ను బ్లాక్ షేడ్స్‌తో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో, సిటీ యొక్క రాత్రి దృశ్యాన్ని చూడవచ్చు. చాలా కాలం త‌ర్వాత చిరంజీవి తన  కెరీర్‌లో ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్ లుక్‌లో కనిపించడం ఇదే తొలిసారి. గాడ్ ఫాదర్ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య తారాగణం.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారుమాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌గా,  సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా నిర్మాతలు: RB చౌదరి & NV ప్రసాద్ సమర్పకులు: కొణిదెల సురేఖ బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంగీతం: S S థమన్ DOP: నీరవ్ షా ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాకాడ అప్పారావు PRO: వంశీ-శేఖర్

సమంత నుంచి మరో ఊ అంటావా మావా సాంగ్

పుష్ప ది రైజ్ .. ఈ మూవీలో అన్ని పాటలూ ఒక ఎత్తైతే ఊ అంటావా మావా అనే పాట ఒక ఎత్తు. అందుకు కారణం అందులో సమంత నర్తించడమే. యస్.. సమంత వల్ల ఈ పాటకు దేశవ్యాప్తంగా మరింత హైప్…

పుష్ప ఖాతాలో రేర్ రికార్డ్..

ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతూనే ఉంది. ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ క్రేజ్ ను పెంచిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ…

కథ లేదు.. ఉన్నా కష్టమేనా పుష్పా.. ?

పుష్పా 2021 డిసెంబర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. అల్లు అర్జున్ లుక్ అండ్ యాక్టింగ్ కు కంట్రీ మొత్తం ఫిదా అయింది. ఆ మాటకొస్తే..…