మే 3న వస్తోన్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ‘

విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కృష్ణమ్మ‘. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘కృష్ణమ్మ‘ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో.. లేటెస్ట్ గా ‘కృష్ణమ్మ‘ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేసింది టీమ్. ఈ స్పెషల్ గ్లింప్స్ లో పవర్ ఫుల్ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు సత్యదేవ్.

Related Posts