మృణాల్ కంటే శ్రీ లీల చాలా తక్కువ

శ్రీ లీల.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్. వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ తనే ఫస్ట్ ఆప్షన్ గా మారింది. పవన్ కళ్యాణ్ తోనూ, వైష్ణవ్ తేజ్ తోనూ, మహేష్‌ సరసనా.. రామ్ తోనూ నటిస్తోంది. అంటే తన డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన బ్యాగ్ లో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.

ఇంకా నితిన్, విజయ్ దేవరకొండల హీరోయిన్నూ తనే. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా వెళ్లి ఫస్ట్ హీరోయిన్ కు ఎసరు పెట్టి తనే మెయిన్ హీరోయిన్ అయింది. అఫ్‌ కోర్స్ తనుగా ఏం చేయకపోయినా.. తన క్రేజ్ అలా ఉందిప్పుడు. దీంతో అంతా తనే టాప్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. మరి టాప్ హీరోయిన్ అంటే రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా..? కానీ కాదు. యస్.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. రెమ్యూనరేషన్ పరంగా చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్న మృణాల్ ఠాకూర్ కంటే శ్రీ లీలకు చాలా తక్కువ.


టాలీవుడ్ కు సీతారామం సినిమాతో పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తన నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. దీంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఇక్కడే కాస్త తెలివిగా స్టెప్ వేసింది మృణాల్. వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోలేదు. తనకు నచ్చింది మాత్రమే పిక్ చేసుకుంది. అది కూడా తను డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ తో. నాని30 సినిమాకు మృణాల్ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ 3 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేయబోతోన్న సినిమాకు ఒకేసారి 50 లక్షలు పెంచింది. ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షలు తీసుకుంటోంది. కేవలం ఒక్క సినిమాకే తను ఈ రేంజ్ కు వెళ్లడానికి తనకు బాలీవుడ్ బ్యాకింగ్ ఉండటం కారణం.


ఇక శ్రీ లీల ఇప్పుడు తీసుకుంటోన్న రెమ్యూనరేష్ ఒక్కో సినిమాకు కోటిన్నర. తన ప్రస్తుతం ఎనిమిది సినిమాలు చేస్తోంది. అంటే ఈ మొత్తానికి 12 కోట్లు వస్తాయి. బట్ మృణాల్ కు కేవలం రెండు సినిమాలకే ఆరున్నర కోట్లు తీసుకుంటుంది. సో.. ఇలా చూస్తే మృణాల్ ముందు శ్రీ లీల చాలా వెనకబడే ఉంది. సో.. చేతిలో ఎన్ని సినిమాలున్నాయి అనేది మాత్రమే కాదు.. ఆయా సినిమాలకు వస్తోన్న పే చెక్ ఎంత అనేది కూడా ఇంపార్టెంటే..

Related Posts