స్కంద .. ఊహించిందేగా

ఊహించినట్టుగానే స్కంద మూవీ పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని సలార్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ లో విడుదల చేస్తున్నారు. స్కంద కొత్త రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే టైమ్ కు బాలకృష్ణ భగవంత్ కేసరి కూడా ఉండటంతో ఆయనతో పోటీ పడటం ఇష్టం లేక దర్శకుడు బోయపాటి శ్రీను ప్రీ పోన్ చేసుకున్నాడు. అప్పుడు డేట్ ను సెప్టెంబర్ 15గా మార్చుకున్నారు. తాజా మార్పుతో ఈ రెండు డేట్స్ మధ్యకు వళ్లినట్టైందని చెప్పాలి.


రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. బోయపాటి, రామ్ మాసివ్ ఎనర్జీ కాంబినేషన్ మూవీగా చెబుతోన్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. ట్రైలర్ కు ముందు వరకూ ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలూ లేవు. అంతకు ముందే వచ్చిన పాటలూ ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో రామ్ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదేంటా అనుకున్నారు. బట్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ బోయపాటి మార్క్ ఎంటర్టైనర్ గా కనిపించింది. దీంతో బిజినెస్ పరంగానూ భారీ ధరలే వచ్చాయి. ఇప్పటి వరకూ తెలుగులో ఏ టైర్ టూ హీరోకూ కాని రేంజ్ లో ఈ చిత్రం ఏకంగా 158 కోట్ల బిజినెస్ చేసింది. ఇందులో 98 కోట్లు డిజిటల్ రైట్స్ కాగా 60 కోట్లు థియేట్రికల్ బిజినెస్. సినిమా ఏ మాత్రం బావున్నా.. థియేట్రికల్ లాభాలు చూడటం పెద్ద కష్టమేం కాదు.

కాకపోతే బోయపాటిని పూర్తిగా నమ్మలేం. ఆ మధ్య వినయ విధేయ రామ ట్రైలర్ తో అంచనాలు ఆకాశంలో పెట్టాడు. తీరా సినిమా చూస్తే దారుణంగా ఉంది. బట్ ఈ సారి ఈ క్రేజీ కాంబినేషన్ లో హిట్ కొట్టడం ఖాయం అంటోంది టాలీవుడ్. అయినా ఈ మధ్య ఇలాంటి ఊరమాస్ రొటీన్ సినిమాలు తగ్గాయి కాబట్టి అదీ ఓ ప్లస్ అవుతుందనే చెప్పాలి.సో.. స్కంద అందరూ ఊహించినట్టుగానే సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. విశేషం ఏంటంటే.. ఆ టైమ్ లో రామ్ కు మూడు నాలుగు సినిమాలు పోటీగా ఉన్నాయి. అయినా దాటేస్తాను అనే నమ్మకం ఉండి.. అది నిజం అయితే స్కంద విజయం ఎవరూ ఆపలేరు.

Related Posts