మహేష్-రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్?

యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు – రాజమౌళి. ‘ఎస్.ఎస్.ఎమ్.బి. 29’ వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మూవీ.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతోందా? అనే ఆతురతో ఉన్నారు ఆడియన్స్. వారందరి కోసం లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత కె.ఎల్. నారాయణ.

ఆద్యంతం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ. అసలు మహేష్, రాజమౌళి కాంబో కోసం 15 ఏళ్ల క్రితం తాను ప్రయత్నించానని.. అప్పుడు చేయాల్సి ఉన్న సినిమా ఇప్పుటికి సెట్ అయ్యిందని ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు కె.ఎల్.నారాయణ్. ఈమధ్యలో రాజమౌళికి ఎన్నో హాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా.. తనకు మాట ఇవ్వడంతోనే అవన్నీ కాదని తనతో సినిమా చేస్తున్నారని కె.ఎల్.నారాయణ అన్నారు.

Related Posts