బేబి బ్యూటీకి ఇంక తిరుగుండదా

ఏదైనా అదృష్టం ఉండాలంటారు. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం తోడైతేనే ఆ టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుంది. మొన్నటి వరకూ యూ ట్యూబ్స్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన వైష్ణవ చైతన్య ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబోతోందా అంటే ఏమో కావొచ్చేమో అనే డైలాగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం బేబీ సినిమా అని వేరే చెప్పక్కర్లేదు. ఈ మూవీతో అమ్మడు ఓవర్ నైట్ ఫేమ్ అయింది. ఇప్పటి వరకూ ఉన్న ఫేమ్ తో పోలిస్తే ఇది వెయ్యి రెట్లు ఎక్కువ. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యంగ్ స్టర్స్ కు వైష్ణవి అంటే బాగా రిజిస్టర్ అయిపోయింది. ఆ పిల్లలో వాళ్ల పిల్లను చూసుకుని తెగ ఫీలైన వాళ్లంతా.. ఆమె నటనకు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు.

అయితే బేబీ అంత పెద్ద విజయం సాధించినా.. ఎందుకో తనకు వెంటనే పెద్ద ఆఫర్స్ రాలేదు. దీంతో తను కూడా మిగతా తెలుగు హీరోయిన్లలాగా ఏ కోలీవుడ్ కో, మాలీవుడ్ కో వెళ్లాల్సిందేనా అనుకున్నారు. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా క్రేజీ ఆఫర్స్ పట్టేసిందీ బేబీ బ్యూటీ.


వైష్ణవి చైతన్య ఏకంగా దిల్ రాజు క్యాంప్ లో ఎంటర్ అయింది. దిల్ రాజు బ్యానర్ అంటే చెప్పేదేముందీ. మాగ్జిమం సక్సెస్ చేతిలో పడినట్టే అంటారు. ఒకవేళ సక్సెస్ పడకపోయినా.. ఖచ్చితంగా ఆమెకంటూ ఓ గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా నటించే సినిమాలో తననే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ వారసులు హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డితో పాటు మల్లిడి నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో అరుణ్‌ భీమవరపు అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులంతా విషయం ఉన్నవాళ్లే. సో.. ఈ మూవీ వైష్ణవికి మంచి ప్లస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.


ఇక మరోవైపు లేటెస్ట్ క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసనా మరో ఆఫర్ కొట్టేసింది వైష్ణవి. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడం విశేషం. 2013లో ఒంగోలు గిత్త తర్వాత భాస్కర్ కు మరో సినిమా రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. 2021లో అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో విజయం అందుకున్నాడు. అయినా మరో ఛాన్స్ రావడానికీ టైమ్ పట్టింది. బట్ ఫైనల్ గా సిద్ధుతో సినిమా అంటే ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు. భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. దీంతో వైష్ణవి కెరీర్ కి ఈ మూవీ కూడా పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి.


ఇక ఈ రెండు సినిమాలూ విజయం సాధిస్తే.. అమ్మడి కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుంది. మరీ టాప్ స్టార్స్ తో కాకపోయినా టైర్ హీరోలు కూడా ఆమెవైపు చూస్తారు. మరి ఓ తెలుగు హీరోయిన్ తెలుగులో తను స్టార్డమ్ తెచ్చుకుంటుందా లేదా అనేది ఈ రెండు సినిమాల రిజల్ట్స్ పై ఆధారపడి ఉందనే చెప్పాలి.

Related Posts