శర్వానంద్ 37 వ సినిమా అప్‌డేట్స్‌

శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్‌ లుక్‌లో సీరియస్‌గా కన్పిస్తున్న పోస్టర్‌ రివీల్ అయ్యింది. ఇది శర్వానంద్ 37 వ సినిమా కోసం ఆవిష్కరించింది. మార్చి 6 న తన బర్త్‌డే సందర్భంగా కెరీర్‌లో వరుస సినిమాలకు ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌లకు శ్రీకారం చుట్టాడు. 35వ సినిమాగా ‘మనమే’ టైటిల్‌ను ఆవిష్కరించిన శర్వా.. 36వ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది.
ఇక 37 వ సినిమాగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌, అడ్వంచర్స్‌ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సామజవరగమనతో బెస్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్‌ రామ్‌ అబ్బరాజు ఈ సినిమాకు డైరెక్షన్‌.
ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Related Posts