సమ్మర్‌లో హెబ్బా పటేల్‌ ‘ధూం ధాం’

సమ్మర్‌లో ధూం ధాం అంటోంది హెబ్బా పటేల్‌. యువ హీరో చేతన్‌ కృష్ణతో కలసి అద్దిరిపోయ ఎంటర్‌టైనర్‌తో రాబోతుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీకి సాయికుమార్‌ మచ్చ డైరెక్ట్‌ చేస్తున్నారు. వెన్నెల కిశోర్‌, గోపరాజు రమణ, పృధ్విరాజ్‌ లు ఇతర కీ రోల్స్ పోషించారు.
రీసెంట్‌ గా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్‌. పెళ్లి బారాత్‌లో డాన్స్‌ చేస్తున్న కలర్‌ఫుల్ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసారు. ఈ వేసవి రేస్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆఖరి దశలో ఉన్నట్టు మేకర్స్‌ తెలియజేసారు.

Related Posts