ప్రీమియర్‌ షోస్‌తో ‘రికార్డ్ బ్రేక్‌ ‘

పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కాబోతున్న మూవీ రికార్డ్ బ్రేక్. ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమాగా ఈ చిత్రం ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే సినిమా రిలీజ్‌ కు ముందు ప్రీమియర్స్ షోస్ వేసారు. ప్రీమియర్స్‌ కు అద్భుతమైన స్పందన రావడంతో దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రీమియర్స్ కి నటి జయసుధ, పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి, దర్శక రచయిత వి విజయేంద్రప్రసాద్ విచ్చేసారు.


తన మిత్రుడు రాజమండ్రి నుండి పంచకట్టుతో వచ్చిన నలమటి వెంకటకృష్ణారావు గారు కొబ్బరికాయ కొట్టి ప్రీమియర్స్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు. పెద్దస్టార్స్ తో కాకుండా.. చిన్న స్టార్స్‌తో గొప్ప కంటెంట్‌తో ప్రతీ భారతీయుడు గర్వించే సినిమా రూపొందించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను చూసి జయసుధ గారు, విజయేంద్రప్రసాద్ గారు, ఆర్‌ నారాయణమూర్తిగారు మెచ్చుకోవడం మా కష్టానికి ఫలితం దక్కినట్టయిందన్నారు.


రికార్డ్ బ్రేక్ సినిమాలో తల్లి సెంటిమెంట్ బాగుంది.. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ చాలా నచ్చిందన్నారు దర్శక రచయిత విజయేంద్రప్రసాద్‌ గారు. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఈ చిత్ర విజయాన్ని కాంక్షించారు.తల్లి సెంటిమెంట్‌ అద్భుతమన్నారు. మనం ఎక్కడినుంచి వచ్చాం మన మూలాలేంటనేది అద్భుతంగా చూపారన్నారు ఆర్‌ నారాయణమూర్తి. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అని విలువలు చాలా బాగా చూపించారు. ఈ రికార్డ్ బ్రేక్ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు పీపుల్స్ స్టార్‌.


తన కొడుకు నిహార్ నటించాడని కాదు గానీ గొప్ప సినిమా గురించి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. చదలవాడ శ్రీనివాసరావు గారితో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ బ్యానర్ నుంచి ఈ రికార్డ్ బ్రేక్ మూవీ రావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది అన్నారు.


మిగతా అతిధులు ఆహ్వానితులు చిత్ర యూనిట్‌ని మెచ్చుకుంటూ సినిమా విజయాన్ని కాంక్షించారు.

Related Posts