షారుఖ్ వర్సెస్ ప్రభాస్.. థౌజండ్ వాలా ఎవరు..

వెయ్యి కోట్లు.. ఒకప్పుడు ఈ మాట వింటే ఇండస్ట్రీ కూడా కళ్లు తిరిగి పడిపోయింది. బట్ ఇప్పుడు చాలా సులువుగా ఆ ఫిగర్ కు చేరుతున్నాయి మన సినిమాల కలెక్షన్స్. అఫ్‌కోర్స్ అందుకు తగ్గ బడ్జెట్ కూడా అవసరమే ఉంటుందనుకోండి. చివరగా ఈ ఫిగర్ సాధించిన సినిమాలు ఆర్ఆర్ఆర్, పఠాన్. ఆర్ఆర్ఆర్ కు అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేశారు. బట్ పఠాన్ మాత్రం అనూహ్యంగా సాధించింది. అయినా ఇండియన్ మూవీసే కాబట్టి హ్యాపీస్.

ఇక నెక్ట్స్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే సినిమాలేంటీ అని అంచనాలు మొదలయ్యాయి. ఆ వెయ్యి కోట్లు ఈ సెప్టెంబర్ లోనే వస్తాయి అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అది కూడా రెండు సినిమాలు. అంటే ఒకే నెలలో రెండు వేల కోట్ల బిజినెస్ కేవలం రెండు సినిమాల ద్వారా జరగబోతోందా..? అంటే అవుననే అంటున్నారు.
సెప్టెంబర్ 7న జవాన్ సినిమా విడుదల కాబోతోంది.

ఆట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరో. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. ఆ మధ్య విడుదలై ట్రైలర్ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను ఎక్కడికో తీసుకువెళ్లింది. అట్లీ బాలీవుడ్ బాక్సాఫీస్ తో పాటు సౌత్ ను కూడా షేక్ చేయడం ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యారు.

పైగా షారుఖ్ పఠాన్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో అవుతోంది. నాన్ థియేట్రికల్స్ తోనే మాగ్జిమం పెట్టబడి వచ్చేసింది. ఇక థియేట్రికల్ గా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలా ఈ మూవీకి వెయ్యి కోట్ల క్లబ్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.


ఇక నెక్ట్స్ వెయ్యి కోట్లు సాధించే సినిమా అంటే ప్రభాస్ సలార్ రెడీగా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లను ఈజీగా దాటేస్తుందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఉంది.

అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ కు బయ్యర్స్ కూడా ఓకే అనేస్తున్నారు అంటే ఈ మూవీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యేడాది ఇండియా నుంచి వెయ్యి కోట్లు కొల్లగొట్టే సత్తా ఈ రెండు సినిమాలకు ఉందని ఖచ్చితంగా అనిపిస్తోంది. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా.. వీరిని దాటడం ఈ యేడాది సాధ్యం కాకపోవచ్చు. అఫ్‌ కోర్స్ రెండు సినిమాలకూ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థౌజండ్ క్రోర్ పై హోప్స్ ఉంటాయి.

Related Posts