అవును.. ఆదికేశవ్ వాయిదా పడింది

వైష్ణవ్ తేజ్.. తెలుగు సినిమా పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చాడు. కానీ ఆ దూకుడు కంటిన్యూ చేయడంలో మాత్రం తడబడ్డాడు. తర్వాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోయాయి.

అస్సలే మాత్రం ఆకట్టుకోలేదీ సినిమాల. ఫస్ట్ మూవీకే వంద కోట్లు కొల్లగొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ కు ఈ రెండు సినిమాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం ఫస్ట్ టైమ్ మాస్ లైన్ లోకి వచ్చాడు. ఆది కేశవ అంటూ రాబోతున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మళయాల స్టార్ జోజూ జార్జ్ విలన్ గా, అపర్ణాదాస్ మరో ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోందీ సినిమా.


రీసెంట్ గా వచ్చిన ఆదికేశవ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది కూడా. చూస్తోంటే వైష్ణవ్ తన రేంజ్ కు మించిన యాక్షన్ తో రాబోతున్నాడనిపించింది. ఇక ఈ మూవీని ఈ నెల 18న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ ఆ మేరకు షూటింగ్ కాలేదు. ఇంకా కొంత పెండింగ్ ఉందట. అందుకే ఆగస్ట్ 18న విడుదల కావడం కష్టం అనే మాటలు ముందు నుంచీ వినిపించాయి.

అది నిజమే అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ నుంచి ఏకంగా మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నారట. అన్నీ కుదిరితే నవంబర్ 10కి విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. నవంబర్ వరకూ ఆగుతారా లేదా అని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ఇప్పుడైతే రావడం లేదు. లేదంటే.. ఇప్పటికే ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యి ఉండేవి కదా.. కనీసం ఒక టీజరో, పాటో వచ్చేది కదా.. రాలేదు కాబట్టి ఆగస్ట్ నుంచి ఆది కేశవ అవుట్ అనే చెప్పాలి.

Related Posts