బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సీనియర్ హీరోలు

ఏ ఇండస్ట్రీలో అయినా కొత్తతరం నుంచి స్టార్స్ ఉద్బవించారు అంటే పాత తరం తప్పుకోవాల్సిందే. కొత్తనీరు వస్తున్నప్పుడు పాత నీరు తప్పుకోవడం అనే సామెతలో దీన్ని చూస్తుంటారు. కానీ ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ అయితే ఆ హీరోలు చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది.ఇమేజ్ కు ఉండే పవర్ అలాంటిది.ఆ ఇమేజ్ తోనే ఇప్పుడు కంట్రీ మొత్తం సీనియర్ హీరోలే హవా చేస్తున్నారు. బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నారు. ఇందుకు లాంగ్వేజ్ బారికేడ్స్ కూడా ఏం లేవు.ప్రస్తుతం వీరే ఇండస్ట్రీస్ షేక్ చేస్తున్నారు.


గతేడాది విక్రమ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు కమల్ హాసన్. అంతకు ముందు దాదాపు పదిహేనేళ్లుగా కమల్ కు ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఉన్నా మాస్ మూవీస్ కాదు. బట్ విక్రమ్ విషయంలో ఓ మ్యాజిక్ జరిగింది. రిలీజ్ కు ముందే కమల్ ఈ సినిమాతో 300 కోట్లు సంపాదిస్తాను.. అప్పులన్నీ తీరుస్తాను అంటే జనం నవ్వారు. కానీ ఆయన నమ్మకం గెలిచింది. మూడు కాదు.. ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందీ సినిమా.ప్రస్తుతం కమల్ హాసన్ వయసు 68యేళ్లు.


తెలుగులో ఈ యేడాది ఆరంభంలో వచ్చిన వాల్తేర్ వీరయ్యతో మన మెగాస్టార్ కేవలం తెలుగు భాషలోనే 230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వారెవ్వా అనిపించాడు.చిరంజీవి కూడా ఈ చిత్రానికి ముందు పెద్దగా ఫామ్ లో లేడు. కానీ ఇమేజ్ కు తగ్గ కథ పడటంతో దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాడు మెగాస్టార్.చిరు వయసు 67.


లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫామ్ లోకి వచ్చాడు. ఆయనా సాలిడ్ బ్లాక్ బస్టర్ చూడక పదేళ్లవుతోంది. ఈ తరుణంలో జైలర్ గా వచ్చిన సూపర్ స్టార్ కంట్రీతో పాటు ఓవర్శీస్ ను కూడా షేక్ చేస్తున్నాడు. అతి తక్కువ టైమ్ లోనే ఈ సినిమా 400 కోట్ల మార్క్ ను దాటింది. పూర్తిగా రజినీ ఇమేజ్ ను బేస్ చేసుకుని రాసుకున్న కథే. అయినా దర్శకుడు చేసిన మ్యాజిక్ కు బాక్సాఫీస్ వణికిపోతోందిప్పుడు. ఈ మూవీ ఈజీగా 500 కోట్ల మార్క్ ను దాటి వసూళ్లు సాధించినా ఆశ్చర్యం లేదు.సింగిల్ హ్యాండ్ తో జైలర్ గా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోన్న సూపర్ స్టార్ వయసు 72యేళ్లు.


ఇక అటు బాలీవుడ్ లోనూ సీనియర్ సింహనాదం. ఎప్పుడో ఫామ్ కోల్పోయిన సన్నీడియోల్ తాజాగా గదర్2తో వచ్చాడు. 2001లో గదర్ ఏక్ ప్రేమ్ కథా అంటూ వచ్చిన సినిమా అప్పట్లోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఆ టైమ్ కు ఆల్ టైమ్ కలెక్సన్స్ రికార్డ్ ను సాధించిందీ సినిమా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో ఇండియా – పాకిస్తాన్ విడిపోతున్న కాలంలో సాగే కథగా వచ్చిన ఈ మూవీలో సన్నీడియోల్ సరసన అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. అప్పుడప్పుడే అమ్మడికి మంచి క్రేజ్ వస్తోన్న దశ అది.ఈ సినిమాకుసీక్వెల్ గా వచ్చిందే గదర్2.

గదర్2ను 1971లో జరుగుతున్న కథగా చూపించారు.గదర్ 2లోనూ ప్రధాన జంటగా సన్నీ, అమీషా నటించారు. బట్ ఈ ఇద్దరూ ఇప్పుడు ఫామ్ లోనే కాదు.. అసలు సినిమాలే చేయడం లేదు. సన్నీ అప్పుడప్పుడూ ఏదోక సినిమాలో కనిపిస్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు.ఓ రకంగా అవుట్ డేటెడ్ కపుల్ తో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.జైలర్ తో పాటే విడుదలైన గదర్2 కూడా 300 కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఓ రకంగా బాలీవుడ్ కే కొత్త ఊపు తెచ్చింది ఈ సినిమా.సన్నీడియోల్ వయసు 66యేళ్లిప్పుడు.


ఇక మరీ వీళ్లంత సీనియర్ కాకపోయినా.. వీళ్లంత కలెక్షన్స్ సాధించలేకపోయినా.. అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్2 కూడా భారీ వసూళ్లే సాధిస్తోంది.ఈ సినిమపై ఉన్న అంచనాలను మించిన వసూళ్లు వస్తున్నాయి.సినిమా భాషలో ఓ మై గాడ్2 కూడా సూపర్ హిట్టే. ఇలా మొత్తం సీనియర్ హీరోలే ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. వీరిలో చిరంజీవి తప్ప కంట్రీ మొత్తం కమాండ్ చూపించగలుగుతున్నారు. సో.. ఏజ్ అనేది అసలు మేటరే కాదు. జస్ట్ వారికి తగ్గ కథ పడాలి. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసే దర్శకుడు ఉండాలి. అంతే. సీనియర్లే ఇప్పుడున్న కొత్త స్టార్స్ ను కూడా భయపెట్టే వసూళ్లు సాధించగలుగుతారు అని నిరూపిస్తున్నారు మేకర్స్.

Related Posts