ఎనర్జిటిక్ గా గండరబాయ్ సాంగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. రామ్, బోయపాటి కాంబినేషన్ అన్నప్పుడే అంతా ఆసక్తిగా చూశారు.

ఊరమాస్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ క్లాస్ హీరో కలిసి చేస్తున్నాడు అంటే ఏదో కొత్త కథ అయి ఉంటుందనుకుంటున్నారు.ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది.ఫస్ట్ లిరికల్ సాంగ్ మరీ గొప్పగా అనిపించలేదు. దీంతో సెకండ్ సాంగ్ విడుదల చేసింది మూవీ టీమ్.


స్కంద చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.ఆయన ట్యూన్ లో అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని నకాష్ అజిజ్, సౌజన్య భాగవతుల కలిసి పాడారు. ఈ పాట మాస్ ఆడియన్స్ టార్గెట్ గా కనిపిస్తోంది.మంచి హుషారైన ట్యూన్, డ్యాన్స్ లకు కావాల్సినంత ఆర్కెస్ట్రైజేషన్ తో మాస్ కు ఊపు తెప్పించేలా ఉందీ గండరబాయ్.

గండరబాయ్ అనే హుక్ లైన్ తో సాగుతూ ఉన్న ఈ పాటలో కాస్త ద్వందార్థలు సైతం వినిపించడం ఆశ్చర్యం. అనంత శ్రీరామ్ ఇలాంటి పాటలు ఇంతకుముందు రాయలేదు. అందుకే ఆశ్చర్యం. “గంటకొట్టి సెప్పుకో గంటకొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండరగండరబాయ్” అంటూ మొదలైన ఈ పాటలోని డ్యాన్స్ లు అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ ఎనర్జీని శ్రీ లీల కంప్లీట్ గా మ్యాచ్ చేసింది.ఇక సినిమాలో ఇంకా అదిరిపోయేలా ఉందీ సాంగ్. మొత్తంగా ఫస్ట్ సాంగ్ సోసోగా ఉన్నా.. సెకండ్ సాంగ్ వినగానే మాస్ బీట్ తో హుషారు నింపేలా ఉంది.

Related Posts