కొత్త డేట్ చూసుకున్న వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్.చిరంజీవి మేనల్లుడుగా, సాయితేజ్ తమ్ముడుగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు.టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ది బెస్ట్ డెబ్యూ అంటే వైష్ణవ్ తేజ్ దే. ఉప్పెన ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు వరుసగా పోయాయి. ఈ రెండు సినిమాల్లో అతని నటన ఫర్వాలేదు అనిపించుకుంది. సినిమాలు పోవడంతో ఒక్కసారిగా నిరాశలో పడతారు. కానీ అతనికి మెగా సపోర్ట్ ఉంది కాబట్టి.. వరుస సినిమాలతో రాబోతున్నాడు.

ఈ క్రమంలో మొదటిసారిగా మాస్ అండ్ ఫ్యాక్షన్ కంటెంట్ తో వస్తున్నాడు వైష్ణవ్ తేజ్.ఈ సినిమా పేరు ఆదికేశవ. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ్ బ్యూటీ అపర్ణాదాస్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. మళయాలీ టాలెంటెడ్ యాక్టర్ జోజూ జార్జ్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.


సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాను ఈ నెల 18న విడదల చేస్తాం అని గతంలో ప్రకటించారు. కానీ వాయిదా వేయక తప్పలేదు.కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పింది మూవీ టీమ. చెప్పినట్టుగానే ఆదికేశను నవంబర్ 10న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆగస్ట్ నుంచి నవంబర్ అంటే మంచి డేట్ కు వెళ్లినట్టే. ఈ లోగా సినిమాను మరింత బాగా రూపొందించుకోవచ్చు.మరి వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత వస్తోన్న వైష్ణవ్ తేజ్ మూవీ ఈ సారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts