హీరోలుకు దీటుగా హీరోయిన్లు కూడా అప్పుడప్పుడూ కదనరంగంలో దుమ్మురేపుతుంటారు. విలన్స్ తో ఫైట్స్ లో చెలరేగిపోతుంటారు. ఇప్పుడు సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా తనలోని యాక్షన్ టాలెంట్ ను బయటపెట్టబోతుంది. కాజల్ లీడ్ రోల్ లో రూపొందుతోన్న ‘సత్యభామ’ టీజర్ రిలీజయ్యింది. కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రూపొందుతోన్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీని వచ్చే వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత దర్శకుడు.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…
ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…
స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…
Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…
కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…